Header Ads

బ్లూ వేల్ బూతం ఇండియాకూ విస్తరించింది.. జాగ్రత్త




ఈమద్యకాలంలో సామాజిక మాధ్యమాల (సోషల్ మీడియా) వినియోగదారులు అధికంగా భయ బ్రాంతులకు లోనవుతున్న విషయం ఏంటంటే "బ్లూ వేల్" (Blue Whale) అనే సామాజిక మాధ్యమ ఆట.  దీనిని ఇప్పుడు "కిల్లింగ్ గేమ్" అని కూడా అంటున్నారు.  ఎందుకంటే ఈగేమ్ లో ఒకసారి జాయిన్ అయిన వ్యక్తిని నెమ్మదిగా వశ పరచుకొని అతనికి మొదటగా సులువుగా ఆడదగిన టాస్క్ లను అప్పగించి తర్వాత చిత్ర విచిత్రమైన క్రూరమైన టాస్క్ లతో చివర గా అతడు గెలవాలంటే లాస్ట్ టాస్క్ గా ఆత్మహత్యను నిర్దేశిస్తారట.  అందుకే దీనిని కిల్లింగ్ గేమ్ అంటున్నారు.  మొదట రష్యా, మధ్య ఆసియా ప్రాంతాలలో ప్రారంభమై వేలాది యువతను ఈ గేమ్ కు బానిసలుగా చేసి వారిని సైకలాజికల్ గా వశ పరచుకొని చివరికి ఆత్మహత్య చేసుకునేల పురిగొల్పి వారి చావుకు కారణమయ్యింది ఈ బ్లూ వేల్ గేమ్.  దీనిపై ఆయా దేశాల సైబర్ టీంలు రంగంలోకి దిగినా కూడా ఫలితం లేకపాయింది.

బ్లూ వేల్ గేమ్ ద్వారా ఎలా వశ పర్చుకుంటారు, ఎలా చంపేస్తారు?
చాలెంజింగ్ గేమ్లు ఆడాలంటే యువత మరియు చిన్నారులకు మహా సరదా కదా.. ఆ ఆలోచనా ధోరణిని ఆసరాగా చేసుకుని డెవలప్ చేసిన అతి క్రూరతి క్రూరమైన ఆటే ఈ బ్లూ వేల్.  వివిధ వెబ్ లింకుల ద్వారా ఈ బ్లూ వేల్ గేమ్ షేర్ కాబడుతున్నది.  వివిధ సోషల్ మీడియా గ్రూపుల ద్వారా ఇది వ్యాప్తి చెందుతున్నది.  యువత మరియు చిన్నారులను రెచ్చగొట్టే విధంగా ఈ గేమ్ లింకులలో పదాలను వాడి వారిని ఆకర్షించి ఆ లింకుల ద్వారా తమ సైట్ కు రప్పించి సైన్ అప్ చేసేవిధంగా చేస్తారు.  ఒక సారి ఆ సైట్ లోకి వెల్లాక అక్కడ సైన్ అప్ అయ్యాక ఇక అసలు కథ మొదలు పెడుతారు.  సోషల్ మీడియా యూజర్ కు అనుకూలమైన టాస్క్ లను మొదట ఇచ్చి గేమ్, యూజర్ కు టాస్క్ లను ఈజీ గా కంప్లీట్ చేయోచ్చన్న నమ్మకాన్ని మొదట కల్పిస్తారు, తర్వాత చిత్రాతి చిత్రమైన క్రూరమైన టాస్క్ లు అనగా, తిమింగలం బొమ్మలను చేతి పై బ్లేడ్ తో కోసుకొని డ్రా చేయమని, ఒంటరిగా హారర్ వీడియోలు చూసి వాటి పై అభిప్రాయాలను చెప్పాలని అది, ఇంకా ఆయుదాలతో శరీరం పై వివిధ రకాల ఆకృతులను గీసుకొని వాటిని ఫోటోలు తీసి వారికి అప్లోడ్ చేయాలనీ ఇలా రోజుకో క్రూరమైన టాస్క్ లను అప్పగించి ఒక వేల ఫేక్ గా గేమ్ ఆడినట్లు తెలిస్తే ఇంకా విపరీతమైన క్రూరతి క్రూరమైన టాస్క్ లు ఇచ్చి హింసించి చివరిగా గేమ్ విన్ కావాలంటే ఆత్మహత్య చేసుకోవాలని దానికి ప్లేస్ కూడా వారే చెప్తారట. చివరికి గేమ్ గెలవాలన్న కసి తోనో లేదా మైండ్ వారి కంట్రోల్ లోకి వెల్లిపోవడం ద్వారానో అనాలోచితంగా యువత ఆత్మహత్య చేసుకొని నిండు ప్రాణాలను వోదిలేస్తున్నారు.  ఇలా ఒక యువత ప్రాణాలను బలిగొంటుంది బ్లూ వేల్ గేమ్.

ఇండియా లో బ్లూ వేల్ గేమ్ సంచలనం:
ఇండియాలో ఇటివల ఒక యువకుడి ఆత్మహత్య కు కారణం బ్లూ వేల్ గేమ్ అని ధరియాప్తులో తేల్చేసారు ఆ వార్త విని కొన్ని రోజులు గడిచాయో లేదో తమిళనాడులో ఒక యువ బ్యాంకు ఉద్యోగిని అయిన యువతీ (21 సం.) చెన్నై బీచ్ కి వెళ్లి తన స్నేహితురాలుకి ఫోన్ చేసి సెల్ఫి దిగుదాం రమ్మని విచిత్రంగా పిలవడం తర్వాత మాట్లాడక పోవడంతో పోలీసులకు సంగతి చేరవేయగా ఆయువతి బీచ్ సమీపంలో ఆత్మహత్యకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా ఆ యువతి బ్లూ వేల్ గేమ్ కు బానిసయినట్టు, చివరి టాస్క్ గా బీచ్ లో  ఆత్మహత్య చేసుకోబోతున్నట్టుగా అంగీకరించిందట.  ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న తమిళనాడు ప్రభుత్వం వెంటనే బ్లూ వేల్ గేమ్ ను బ్లాక్ చేసింది.  కాని బ్లూ వేల్ గేమ్ ఏ ఏ URL ద్వారా వ్యపిస్తున్నదో ఇంతవరకూ స్పష్టమైన అవగాహన లేకపోవడం దానిని అదుపుచేయలేకపోతున్నారు.

సోషల్ మీడియా గ్రూప్ లలో ఏదైనా చాలెంజింగ్ గేమ్ అంటూ రెచ్చగొట్టే ప్రకటనలను చూసి వెంటనే క్లిక్ చేయకండి ఒక్కసారి ఇలాంటి గేమ్ లో రిజిస్టర్ చేసుకుంటే ఇక మీ సంగతి అంతే.  జాగ్రత్త.



Tags: Blue Whale, blue wel, bloo wel, blue wale, killer, game, online, social media, beware, world wide crisis.

No comments