Header Ads

బాసర ‘ట్రిపుల్ ఐటీ’ (IIIT) నోటిఫికేషన్ వొచ్చేసింది. ఫీజు, ఆకరు తేది, దరకాస్తు, ఎంపిక విధానం తెలుసుకోండి.



IIT BASARA

పదవ తరగతి విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలంగాణాలోని బాసరలో గల ట్రిపుల్ ఐటీ (IIT)  2017-18 సంవత్సరం ప్రవేశానికి గాను నోటిఫికేషన్ వచ్చేసింది.  1000 సీట్ల బర్తీకి గాను తెలంగాణా (బాసర)లో ఉన్న ఏకైక వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT IIIT) నోటిఫికేషన్ విడుదల చేయటం జరిగింది.  10వ తరగతి ఉత్తేర్నులైన విద్యార్థుల నుండి ధరకాస్తులను స్వీకరణ 28వ తేది నుండి మొదలవనున్నాయి.  10వ తరగతి విద్యార్థులు తమ ఫలితాలతో సంభంధం లేకుండా తమ హాల్ టికెట్ తో దరకాస్తు చేసుకోవచ్చును.  మార్కుల జాబితాను యూనివర్సీటి సెకండరీ బోర్డు నుంచి తీసుకొని ప్రవేశాల ఎంపిక జాబితాను విడుదల చేయనున్నారు.

ప్రవేశ అర్హతలు (Eligibility):
రాష్ట్రంలోని ప్రభుత్వ గుర్తింపు కల్గిన పాటశాలల్లో 2017 సంవత్సరం 10వ తరగతి లేదా తత్సమాన పరీక్షలలో ఒకేసారి (సప్లమెంటరి కాకుండా) ఉత్తేరునులై ఉండాలి.

రిజర్వేషన్ల (Reservation) వివరాలు:
85 శాతం సీట్లను తెలంగాణా వాసులకు కేటాయించగా మొత్తం 1000 సీట్లలో మిగిలిన 15 శాతం ఓపెన్ కేటగిరిలో తెలంగాణాతో పాటు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకూ ప్రవేశం కల్పించనున్నారు.

రిజర్వేషన్‌ల ప్రకారం సీట్ల కేటాయింపు:
ఎస్సీ: 15,
ఎస్టీ: 6,
బీసీ-ఏ: 7,
బీసీ- బి: 10,
బీసీ-సీ: 1,
బీసీ-డీ: 7,
బీసీ-ఈ: 4,
ఫిజికల్లీ హ్యండిక్యాప్‌: 3,
క్యాప్‌: 2,
ఎన్‌సీసీ: 1,
స్పోర్ట్స్‌: 0.5


పాటు ఇతర రాష్ట్రాల విద్యార్థులకు: 50 సీట్లు,
ఎన్‌ఆర్‌ఐ కోటా కింద: 20.
అన్ని విభాగాల్లో బాలికలకు: 33.3 శాతం ప్రవేశాల్లో రిజర్వేషన్‌ పాటిస్తారు.

ప్రవేశ (Admission) విధానం:
10వ తరగతిలో విద్యార్థులు సాధించే జీపీఏ ఆధారంగానే ప్రవేశాలు కల్పించాబడుతాయి.

వెనుకబాటు సూచిక క్రింద ప్రభుత్వ పాటశాలలలో, ప్రభుత్వ నాన్ రెసిడెన్శియల్, ఇతర జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు 0.4 శాతం పాయింట్లను అదనంగా జతకలిపి ప్రవేశాల్లో ప్రాధాన్యత కల్పిస్తారు.

ఒకవేళ అభ్యర్ధులు ఒకే గ్రేడ్ పాయింట్లు సాధించి పోటి పడినచో వారి వారి సబ్జెక్టులలో వారు సాధించిన మార్కుల ప్రకారం ఎంపిక చేసుకోవటం జరుగుతుంది. ఈ విషయంలో వారు సాధించిన మార్కులను సబ్జెక్టుల వారిగా అనగా మొదట గణితం, తర్వాత జనరల్‌ సైన్స్‌, ఆ తర్వాత ఇంగ్లీష్‌, ఆ తర్వాత సోషల్‌ స్టడీస్‌, ఆ తర్వాత ఫస్ట్‌ లాంగ్వేజీలలో వారు సాధించిన మార్కుల ఆధారంగా వారి ఎంపిక జరుగును ఐననూ వారి మధ్య పోటి ఉన్నచో అప్పుడు వారి వయస్సు ఆధారంగా కూడా ఎంపిక జరుగును.  ఉదా.  సమన గ్రేడ్ పాయింట్ మరియు సబ్జెక్టులలో సమాన మార్కులు నమోదు అయినచొ అట్టి సందర్భంలో వయస్సు ఎక్కువ ఉన్న విధ్యార్ధులను ఎంపిక చేసుకోనబడును.


దరఖాస్తు (Application) విధానం:
దరకాస్తు ప్రక్రియ కేవలం ఆన్‌లైన్‌ (Online) ద్వారా మాత్రమే.
ఆన్‌లైన్‌ సెంటర్లు మీసేవా, పీఎస్‌, తదితర సౌకర్యాల ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరకాస్తు రుసుము (Application Fee) వివరాలు:
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ. 150,
ఓసీ, బీసీ విద్యార్థులు రూ.200 చొప్పున ప్రవేశ రుసుమును నిర్దేశించటం జరిగింది.
అభ్యర్ధులు ఈ మొత్తాన్ని ఆయా ఆన్‌లైన్‌ సెంటర్ల వద్దనే చెల్లించవలెను.
ప్రవేశ రుసుము తో పాటు ఆన్‌లైన్‌ సెంటర్‌ యొక్క సర్వీస్‌ చార్జీ రూ.25లు చెల్లించవలెను.

ముఖ్యమైన తేదిలు:
తేది 28-04-2018 నుండి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది
అలాగే దరకాస్తు స్వీకరణకు చివరి తేది 24-05-2018 గా తెలపటం జరిగింది.
అభ్యర్ధులు తమ సర్టిఫికేట్‌లను విశ్వవిద్యాలయంనకు  పంపించాల్సిన చివరి తేది : 29-05-2018
అభ్యర్దుల ఎంపిక జాబితా విడుదల చేయు తేది: 05-06-2018
మొదటి కౌన్సెలింగ్‌ జూన్ 19 మరియు 20 తేదిలలో (2018)
ప్రత్యేక కెటగిరీ విద్యార్థులకు కౌన్సెలింగ్‌ జూన్‌ 22, 24, 27 తేదిల్లో జరుగును.
చివరి దశ కౌన్సెలింగ్‌ జూన్‌ 29, 30 తేదిల్లో జరుగును.
కొత్త విద్యార్థులకు జూలై 1వ తేది నుంచి తరగతులు ప్రారంభం.

వార్షిక రుసుము వివరాలు (IIIT Fee details) :
6 విద్యా సంవత్సరాలు గల ట్రిపుల్‌ ఐటీలో ప్రవేశం పొందిన అభ్యర్ధులకు అన్ని ఇంజనీరింగ్ సంభందిత విద్యా కోర్సులు ఉంటాయి.  అభ్యర్ధులు మొదటి రెండేళ్ళు వార్షిక రుసుము గా రూ. 36,000 (ముప్పై ఆరు వేలు), ఆతర్వాత మిగిలిన నాలుగు సంవత్సరాలకు వార్షిక రుసుము రూ. 40,000 (నలబై వేలు) గా చెల్లించాల్సి ఉంటుంది. 
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి అర్హులైన అభ్యర్ధులు మాత్రం ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన పని లేదు అట్టి ఫీజును ప్రభుత్వమే భరిస్తుంది.  ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తించని విద్యార్థులు మాత్రమె పైన చెప్పినటువంటి ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.  ఒకవేళ ఇట్టి రుసుమును చేల్లిచలేని ఎడల విద్యార్థి అభ్యర్ధన మేరకు యూనివర్సిటీ బ్యాంకు నుండి రుణ సదుపాయం కల్పించబడుతుంది.


ఉచిత సౌకర్యాలు (Free accommodation details):
పేద విద్యార్థులు ఎవరైతే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంనకు అర్హులో వారికి విద్య తో పాటు అన్ని సౌకర్యాలు ఉచితంగా  ప్రభుత్వమే కల్పిస్తుంది.  అంటే ఈ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ క్రిందకి రాణి జనరల్ అభ్యర్ధులకు ఏ ఏ సౌకర్యాలు ఉన్నాయో అలంటి సౌకర్యాలు ఉదా. ల్యాప్‌టాప్‌, డ్రెస్సులు, షూలు, ఇతర హాస్టల్‌లో అవసరమైన అన్నింటిని ఆరు సంవత్సరాల పాటు అంటే మొత్తం ట్రిపుల్ ఐటి అయిపోయేదాకా అన్నీ ప్రభుత్వమే సమకూర్చుతుంది.  అన్ని వసతులనూ కార్పొరేట్‌ స్థాయి కంటే ఉన్నతంగా ఉండేలా ప్రభుత్వం సౌకర్యాలను కల్పిస్తోంది.


కౌన్సెలింగ్‌ (Counseling) సమయంలో సమర్పించాల్సిన ధ్రువీకరణ పత్రాలు:
ఎంపికైన అభ్యర్ధులు కౌన్సెలింగ్‌కు వచ్చే సమయంలో అన్ని ద్రువీకరణ పత్రాలు అనగా ధరకాస్తు చేసుకున్నప్పుడు ఏవైతే దృవీకరణ పత్రాలను సమర్పించినారో వాటన్నిటినీ కౌన్సెలింగ్‌కు వచ్చే సమయంలో కూడా సమర్పించవలసి వస్తుంది.  కౌన్సెలింగ్‌కు వచ్చే సమయంలో అన్ని ధృవీకరణ పాత్రలను వెంట తీసుకురావాలి.


ఆన్లైన్ అప్లికేషన్ (Online Application) కొరకు ఇక్కడ క్లిక్  చేయండి  




ఇతర సంబందిత వివరాల కోసం వెబ్సైటు ను సందర్శించండి: http://www.rgukt.ac.in/

No comments