Header Ads

సోను సూద్ ఎఫెక్ట్.. ప్రభుత్వం పై ఎంత? హీరోలపై ఎంత?

Sonu Sood latest-gstrendsnow
సాధారణ సమయాల్లో ప్రభుత్వాల పనితీరు ఎలా ఉన్నప్పటికీ, విపత్తుల సమయంలో సరైన రీతిలో ప్రభుత్వాలు తమ పనితీరును కనబరచకపోతే ఆ ప్రభుత్వాలు విఫలమైనట్టే లెక్క. గత కరోనా సమయంలో కేంద్ర, రాష్ట్ర (తెలంగాణ) ప్రభుత్వాల పనితీరుపట్ల ప్రజల్లో పెదవి విరుపులే కనిపించాయి. రెండో దశతో పోల్చుకుంటే, మొదటి దశ కరోనా సమయంలో ప్రాణ నష్టం తక్కువనే చెప్పాలి. కానీ ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని, ప్రజారక్షణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణి అవలంభించడం మూలంగా రెండో దశ కరోనా మూలంగా భారీగా ప్రాణనష్టం జరుగుతోంది. మరి ఇంత విపత్కర సమయాలలో ప్రజల ప్రాణాలను రక్షించేందుకైనా ప్రభుత్వాలు సరైన చర్యలు చేపడుతున్నాయా అంటే.. రాష్ట్రంలో ప్రైవే హాస్పిటల్ల ఫీజుల దందా, బ్లాక్ మార్కెట్ లో కరోనా మందుల దందా, ఆక్సిజన్ అందక, ఆసుపత్రుల్లో బెడ్స్ ఖాళీ లేక ప్రజలు పిట్టల్లా చేస్తున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం చోద్యం చూస్తోంది. కేంద్రం సరైన ఆక్సిజన్ నిల్వలను అందించడం లేదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వినోదం పేరుతో ప్రజల జేబులకు చిల్లులు పెట్టె రీల్ హీరోలుగానీ, ప్రభుత్వాలుగానీ సరైన రీతిలో స్పందించని సమయంలో తెరమీద దుష్టునిగా, దుర్మార్గునిగా మన దర్శకులు మనకు పరిచయం చేసిన ఓ కళాకారుడు సోను సూద్. తాను తెరమీద మాత్రమే విలన్ ను, సమాజంలో నిజమైన సూపర్ హీరోను అని తనను తాను ప్రజలకు పరిచయం చేసుకుంటూ, ప్రజలు ఆపదలో ఉన్న సమయంలో మౌనంగా ఉన్న ప్రభుత్వాలకు, తెరపైన హీరోలకు చెంప పెట్టులా తన సేవలు అందిస్తూ ముందుకు వచ్చాడు. గత కోవిడ్ సమయం నుండి నేటి వరకు ఈ రియల్ హీరో చేస్తున్న సేవలకు రీల్ హీరోలు జీరోలుగా మారుతూ, ట్విట్టర్ వీరులు, ప్రజల సొమ్ముతో కార్పొరేట్ల సేవ చేసే ప్రభుత్వాలు ఇరుకునపడుతున్నాయి. ఒక సామాన్యుడు చేసినంత సేవ మీరు చేయలేరా అంటూ ప్రజలు వారిని ఏకిపడేసేలా చేశాయి.

 

ప్రభుత్వాలు, రీల్ హీరోలపై ఆగ్రహించిన ప్రజలు

సోను సూద్ ఎఫెక్ట్ తో ప్రజలు వారి వారి సోషల్ మీడియా వేదికల్లో "ఒక సామాన్య కళాకారుడు ప్రజల కోసం ఇంత చేస్తుంటే, ప్రజల సొమ్ముతో గద్దెనెక్కి పెత్తనం చేసే ప్రభత్వాలు ప్రజల కోసం ఏమి చేసేటున్నట్టని" ప్రశ్నిస్తున్నారు. ఆక్సిజన్ అవసరమని అడిగిన నిమిషాల వ్యవధిలోనే సోను బాధితులకు అందిస్తుంటే, ప్రభుత్వాలు మాత్రం ప్రజలు చస్తున్నా మౌనం పట్టిస్తున్నాయని  ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అలాగే, తమ సినిమాలకు ఒక రాష్ట్రం పంపిణీ హక్కులను పొందుతూ, టికెట్ రేట్లను ఇష్టానుసారం పెంచేసుకొని వినోదం పేరుతో ప్రజల జేబులకు చిల్లులు వేసే రీల్ హీరోలు కరోనా మూలంగా ప్రజలు చస్తున్నా తెరపై విలన్ గా నటించి ప్రజల నుండి ఎలాంటి లబ్ది పొందని సోను సూద్ చేస్తున్న సేవల్లో కనీసం పది శాతమైనా చేయలేరా అని నిలదీశారు. 


KCR-KTR--gstrendsnow
స్పందించిన ప్రభుత్వం.. ఆయుశ్మాన్ భారత్ క్రిందకి కరోనా

సోను ఎఫెక్ట్ తో ఎదురవుతున్న విమర్శలకు ఎట్టకేలకు ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి ఇటీవలే కరోనా చికిత్సను ఆయుష్మాన్ భారత్ క్రిందకి తీసుకురావడం జరిగింది. అలాగే, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం కరోనా కోసం సయాం కోసం తనను ట్విట్టర్ వేదికగా సంప్రదించాలని, వెంటనే ఆక్సిజన్ సిలిండర్లు, రెమిడిసివిర్ ఇంజక్షన్స్ కానీ అందిస్తానని పత్రికాముఖంగా ప్రకటించారు. 


Chiranjeevi-latest-gstrendsnow

ప్రతి జిల్లాకు ఆక్సిజన్ సిలిండర్ ప్యాంటు ను ఏర్పాటు చేస్తున్న మెగాస్టార్

ఇక సోను సేవలకు తనపై వెల్లువెత్తుతున్న విమర్శలకు తాళలేక టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి స్పందించి ప్రతి జిల్లాకో ఆక్సిజన్ సిలిండర్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తామని ఇటీవలే ప్రకటించినట్టు వార్తలు వచ్చాయి. 


Balakrishna-gstrendsnow

సేవలో ముందున్న నటసింహం.. 

ఇక సోను సూద్ ఎఫెక్ట్ మాత్రం టాలీవుడ్ నటసింహం బాలకృష్ణ పై పడలేదని చెప్పాలి. ఎందుకంటే, తన నియోజకవర్గ ప్రజల కోసం గత కరోనా సీజన్ నుండి నేటి రెండో దశ కరోనా సీజన్ వరకు కరోనా చికిత్స నిమిత్తం లక్షల రూపాయల తన సొంత సొమ్మును విరాళంగా అందించారు. అలాగే ఈ కరోనా సీజన్ లో 20 లక్షలు హిందూపూర్ నియోజకవర్గ ప్రజల కరోనా చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి అందించారు. అంతే కాకుండా తన గెస్ట్ హౌస్ ను కరోనా చికిత్స కోసం క్వారంటైన్ సెంటర్ గా ఉపయోగించుకోవాలని ప్రభుత్వాసుపత్రి వర్గాలకు అనుమతిచ్చారు.

 

మొత్తం మీద కరోనా  అందించేందుకు బద్ధకిస్తున్న మన ప్రభుత్వానికి, రీల్ హీరోలకు సోను సూద్ చేస్తున్న సేవలు ప్రభావితం చేసి ప్రజలు వారిని ప్రశ్నిచేలా చేసి కరోనా నివారణ చర్యల్లో సరైన రీతిలో వారు స్పందించేలా చేసాయి. ఇప్పటికీ రియల్ హీరో సోను సూద్ మాత్రమే మరి.



See also: corona virus, covid-19, covid 19, telangana, sonu sood, sonu sud, sonu soodh latest news, fake or real, sonu services, sonu soodh article, sonu sood wiki, sonu sood viki, sonu sood services in covid 19, sonu sood wikipedia, Chiranjeevi, Balakrishna, KCR, KTR, oxygen cylinder, remidicivir,  

 


No comments