Boost your current affairs ability and general knowledge by following this site for latest trending updates of Current Affairs, Politics, Technology & Gadgets, Movies, Finance, Sports, Viral videos, telugu news & articles
Menu
▼
Pages
▼
Tuesday, 4 July 2017
తొలి ఏకాదశి ప్రత్యేకతలు, పూజ చేయు పద్ధతి, ఆహార నియమాల గురించి తెల్సుకోండి
ఇంగ్లిష్ సంవత్సరంలాగే తెలుగు సంవత్సరాది లో కూడా 12 మాసములు ఉంటాయి, ఈ మాసాలలో ఏకాదశి 24సార్లు వస్తుంది.కాని అన్ని ఏకాదశిలను విశిష్టంగా
భావించినప్పటికీ సంవత్సరంలో అంటే ఉగాది పర్వదినం నుండి మొదలుకొని తొలిసారి వొచ్చు
ఆషాడ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకొంటాము, ఈ రోజు అనగా ఆషాడ శుద్ధ ఏకాదశి నుండి
కార్తీక శుద్ధ ఏకాదశి వరకు మహా విష్ణువు పాల కడలిపై శాయనిస్తాడు కాబట్టి దీనిని శయన
ఏకాదశి అని కూడా అంటారు.ఈరోజు యోగ నిద్రకు
ఉపక్రమించే మహా విష్ణువు తిరిగి నాలుగు నెలల తర్వాత అంటే కార్తీక శుద్ధ ఏకాదశి నాడు
మేల్కొంటాడు దీనినే ఉత్తాన ఏకాదశి అంటారు. మహా విష్ణువు యోగ నిద్రలో ఉండే ఈ నాలుగు నెలల కాలాన్ని
పరమ పవిత్రంగా భావించి భక్తులు “చతుర్మాస్య దీక్ష” చేస్తారు.
తొలి ఏకాదశి రోజున
హరి హరాదుల నామ జపం చేయుచూ పుణ్య నదీ స్నానం ఆచరించి హరి హారాదులను దర్శనం
చేసుకొనుట వలన సకల పాపములు హరించి పుణ్యం చేకూరుతుందని పురాణాలు
చెబుతున్నాయి.కావున తొలి ఏకాదశిని పర్వదినంగా
జరుపుకొంటాము.
తొలి ఏకాదశి పూజ విధానం:
తొలి ఏకాదశి రోజున బ్రహ్మ
ముహూర్తం అనగా సూర్యోదయానికి ముందు నిద్ర లేచి, తల స్నానమాచరించి, నియమ నిష్టలతో పూజించాలి.
విష్ణు లేదా శివుడి విగ్రహాన్ని శుద్ధి చేసి
పసుపు, కుంకుమ, పుష్పాలతో అలంకరిచి, కొబ్బరి కాయను కొట్టి కొబ్బరి నీటితో స్వామికి
ప్రసాదంగా చేసి, తర్వాత చక్కర పొంగలిని లేదా ఇతర తీపి పదార్థాలతో లేదా వారి వారి స్తోమతకు
తగినట్టుగా ఏదైనా తీపి పదార్థంను నైవేద్యంగా సమర్పించాలి.
తొలి ఏకాదశి ఆహార నియమ
నిభందనలు:
ఇక ఆహార నియమాలకు వస్తే,
ఏకాదశి పూజ చేసేవారు మరియు ఇంట్లోని కుటుంభ సభ్యులు మాంసాహారం, గుమ్మడి కాయ, చింతపండు,
ఉసిరి, ఉలువలు, మినుములతో చేసినవి, వండిన ఆహార పదార్థాలను ఆరగించారాదు. అలాగే మంచం పై శయనించ రాదు. కటిక నీలపై శయనించవలయును.
ఈసారి తొలి ఏకాదశి
మంగళవారం రావడంతో భక్తులతో వివిధ ఆలయాలు క్రిక్కిరిసి పోయాయి. ఏకాదశి శివుడికి ప్రీతిపాత్రమైనదని విశ్వాసం కలదు.
తొలి ఏకాదశి మాత్రమే కాకుండా ప్రతి మాసంలో
వచ్చే ఏకాదశి కుడా పుణ్య దినమే కావున ప్రతి మాసంలో వచ్చే ఏకాదశి రోజున శివుడిని ప్రార్ధిస్తూ
పూజలు చేయుట ద్వార వారి వారి గ్రహచార దోషములు హరించి వారికి శుభం కలుగునని శాస్త్రాలు
తెలుపుతున్నాయి.
No comments:
Post a Comment