Header Ads

సూర్య గ్రహణం: 21 ఆగష్టు 2017 రాశుల వారిగా మంచి, చెడులు, గర్భిణీ స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలు




సంపూర్ణ సూర్య గ్రహణం ఈ సోమవారం అనగా 21 ఆగష్టు 2017 రోజున సంభవించాబోవుచున్నది.  సంపూర్ణ సూర్య గ్రహణం గ్రహ రీత్యా చూసుకున్నట్లయితే సూర్యుడు ఈ సంపూర్ణ గ్రహణం రోజున సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు.  ఇలాంటి సంపూర్ణ సూర్య గ్రహణం 99 సంవత్సరములకొకసారి సంభవించునని అటు పాశ్చాత్య దేశస్తులు, శాస్త్రవేత్తలు మరియు పండితులు, జ్యోతిష్కులు అభిప్రాయపడుతున్నారు.
సింహ రాశి అనునది రాజ రాశి.  అధికారాన్ని, శక్తిని ఇది సూచిస్తుంది.  ఈ రాశికి గల మంచి లక్షణాలు ఆత్మా విశ్వాసం, ప్రేమ, రక్షణ మరియు ఊహాత్మక శక్తి.  ఇక సింహ రాశి యొక్క చెడు లక్షనాలకొస్తే అహంకారం, నియంత పోకడలు, అణచివేత మరియు గర్వం మొదలైనవిగా చెప్పుకోవోచ్చు.  ఈ సింహ రాశి, రాశి చక్రంలో పంచమ స్తానంలో ఉంటుంది.  మంత్రాంగం, క్రీడలు, సరదాలు, వినోదాలు, జూదం మొదలైనవి ఈ పంచమ స్థానం ఆధీనంలో ఉంటాయి.  ఇక సింహ రాశిలో రాహువు, చంద్రుడు, సూర్యుడు, భుధుడు ఉండగా, మస్చికం నుంచి శని తన దశమ ద్రుష్టితో వీరిని వీక్షిస్తున్నాడని పండితులు అభిప్రాయపడుతున్నారు.
కర్కాటకంలో శుక్రుడు, కుజుడు ఉన్నారు, కన్యలో గురువు, వ్రుస్చికంలో శని ఉన్నారు.  కేతువు కుంభ రాశిలో ఉన్నాడు.  ఈ గ్రహణ సమయంలో రాశి మీద ఎక్కువ చెడు గ్రహాల ప్రభావం ఉంటె చెడు ఫలితాలు ఎక్కువగా ఎదుర్కోవలసిన పరిస్థుతులు సంభవించవచ్చు.  గోచార సూర్యుడు, గోచార రాహు కేతువులతో ఏర్పడే కేంద్ర ద్రుస్టి వల్ల ఈ సంగటనలు సంభవించే ఆస్కారముంది.  కనుక సూర్యుడు వృచ్చిక, కుంభ, వృషభ రాశులలో ఉండగా కొన్ని చెడు సంగటనలు జరుగుతాయి.  

ఇక రాశులవారిగా గ్రహణ ఫలితాలు చూస్తే, ఈ క్రిందివిధంగా చెప్పవచ్చును:
మేష, వృషభ, కన్య, ధనుస్సు రాశులవారికి ఈ గ్రహణం శుభ ఫలితం ఇస్తుందని జ్యోతిష్కులు సూచిస్తున్నారు.

మిథున, సింహ, తుల, మకర రాశులవారికి ఈ గ్రహణం మిశ్రమ ఫలితాలనిస్తాయని జ్యోతిష్కులు అభిప్రాయపడుతున్నారు.

మిగిలిన కర్కాటక, వృశ్చిక, కుంభ, మీనా రాశుల వారికి ఈ గ్రహణం అశుభ ఫలితాలను ఇచ్చునని జ్యోతిష్కులు అభిప్రాయపడుతున్నారు.

గర్భిణీ స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలు, నియమ నిష్టల వివరాలు:
గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో మీ గోత్ర నామాలచే ఆలయంలో నిస్తావంతులైన భ్రహ్మనులచే గర్భ రక్షణ స్తోత్రం పారాయణం చేయాలి.  

పిల్లలు, వయో వృద్ధులు మరియు గ్రహణ పీడిత రాశుల వారు పాటించవలసినవి:
పిల్లలు వయోవృద్ధుల పేరిట మృత్యుంజయ స్తోత్రం పారాయణం చేయాలి.  ఇక మిగతావారు ఆదిత్య హృదయ స్త్రోత్రం పారాయణం చేసుకోవడం ద్వారా గ్రహణ దుష్ప్రభావం వారి పై పడకుండా జాగ్రత్త వహించవచ్చు.  పైన తెలిపిన పరిహారాలను పాటిస్తే కొంతవరకు గ్రహణ ప్రభావం తమ పై పడకుండా కాపాడుకోవోచ్చని జ్యోతిష్కుల అభిప్రాయం.



Tags: surya grahana bad and good results, prediction, astrology, surya, grahanam, grahana time pregnancy ladies precautions, children precautions, remedies, mantras, rashi predictions, rashi results, rashi astrology.

No comments