Header Ads

Viral Poster Issue: తాతయ్య చిల్ కాదు "విజయ్ దేవరకొండ వేక్ అప్"



అర్థవంతమైన సినిమాలు, ఆకట్టుకునే సినిమాలకు ఆడియన్స్ ఎప్పుడూ బ్రహ్మరథం పడుతూనే ఉంటారు.  అలాగని అదే ముసుగులో అశ్లీలం గుప్పించి కాసులు పోగేసుకున్ధమనే ఉద్దేశంతో సినిమాలు తీసి వైరల్ ఫోటోలు వీడియోలు సినిమా రిలీజ్  కు ముందే వాటిని సోషల్ మీడియా లేదా బజారులలో పెట్టి సినిమాకు తక్కువ కర్చుతో ఎక్కువ పుబ్లిసిటీ చేసుకొని అది వివాదంగా మారితే ఎలక్ట్రానిక్ మీడియా వేదికగా చర్చలతో ఇంకొంచెం వివధస్పధమైన స్టేట్మెంట్లు ఇచ్చి ఎక్కువ వివాదంతో సినిమాకు పైసా కర్చు లేకుండా ఫ్రీ పుబ్లిసిటీతో రిలీజ్ చేసి సినిమాలో ఉహించినంత మేటర్ లేకున్నా నిర్మాత జేబులు నింపుకొని బతికే నీచ సంస్కృతి (చీప్ టెక్నిక్) బాలీవుడ్ నుండి టాలీవుడ్కు కూడా పాకినట్టుంది అని అనిపిస్తోంది.  ఇటీవల జరిగిన పోస్టర్ వివాదం చూస్తుంటే అలాగే అనిపిస్తుంది సగటు మనిషికి.

విజయ్ దేవరకొండ పలు అర్థవంతమైన సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ మరియు హీరోగా చేసారు అయన రీసెంట్ గా పెళ్లి చూపులు అనే మంచి అర్థవంతమైన అవార్డు పొందిన సినిమాలో ఉత్తమ నటనను ప్రదర్శించారు.  ఇటీవల అయన హీరోగా నటిస్తున్న మరో సినిమా "అర్జున్ రెడ్డి" రిలీజ్ కు రెడీ అయ్యింది దానికి సంభందించిన టీజర్ ఇటీవలే రిలీజ్ అయ్యి అశ్లీల దృశ్యాలతో సంచలనం సృష్టించింది టీజర్ కు ఏమాత్రం తగ్గకుండా ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆ సినిమాకు సంభందించిన ఒక పోస్టర్ ఇప్పుడు హైదరాబాద్ నగరంలో వివాధమైంది.  ఆ పోస్టర్లో హీరో హీరోయిన్లు ఇద్దరూ ఘాడ చుమ్బనంలో ఉన్నారు.  ఈ పోస్టర్ పలు ముఖ్యమైన బస్సు షెల్టర్లలో, RTC బస్సు ల పైన దర్శనమిచ్చాయి.  దాని పై కాంగ్రెస్ MP వి. హనుంత రావు గారు స్పందించి పోస్టర్లను తొలగించి ఇలాంటి అశ్లీల పోస్టర్లను జన సంచారం ఎక్కువగా ఉండే, సగటు మనిషి కుటుంభం తో ప్రయాణించే RTC బస్సు షెల్టర్లలో బస్సు పైన వేసి పుబ్లిసిటీ చేసుకోవడాన్ని తప్పు పట్టారు.  సినీ నిర్మాతను సినిమా బృందాన్ని ఈ చర్యకు పాల్పడినందుకు ఖండించారు.

ఇదిలా ఉండగా సదరు సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో హీరో గారు విజయ్ దేవరకొండ మర్యాద లేకుండా MP హనుమంత రావు గారిని తాతయ్య చిల్ అని సంబోధిస్తూ తనదైన పదజాలం తో విమర్శించారు.  దీనికి సిగ్గులేకుండా సినీ పెద్ద గా చెప్పుకొనే తమ్మారెడ్డి భరద్వాజ గారు కూడా స్పందించి సగటు హీరో గారికి మరియు చిత్ర బృందానికి సపోర్ట్ ఇస్తూ.  సినిమా అనేది ఎంతో డబ్బు వెచ్చించి ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి తీసేది అందులో ముద్దు ఉండాలా లేక ఇంకో హాట్ సీన్ ఉండాలా లేదా అని డిసైడ్ చేయడానికి నువ్వెవరు అని పోనీ అలంటి దృశ్యాలు ఏమి లేకుండా సినిమా తీస్తే అది ఫ్లోప్ ఐతే నువ్వేమైన నిర్మాతకు డబ్బులిస్తావా?, పవిత్రంగా సినిమా తీస్తే జనాలందరూ చూస్తారా అని తీవ్ర పదజాలంతో సగటు MP వి. హనుమంత రావు పైన విరుచుకుపడ్డారు.  నిజమే సినిమా ఎలాగైనా తీసుకోవొచ్చు, హీరోయిన్ ఒప్పుకుంటే బట్టలు మొత్తం ఊడదీసి వివిధ ఆంగిల్స్ లో తీసి తీసి తమ క్రియేటివిటీ ని చాతుకోవోచ్చు కూడా, సెక్స్ ను రియాలిటీ గా చూపించాలనే నెపంతో బ్లూ ఫిలిం ను తల దాన్నే రీతిలో తీసి డబ్బు సంపాదిన్చుకోవోచ్చు కూడా దానికి సగటు ప్రేక్షక్డు ఎవడు ఎదురు చెప్పే హక్కు లేదు నచ్చితే చూడొచ్చు నచ్చకుంటే చూడకపోవొచ్చు అది ప్రేక్షకుడి ఇష్టం అలంటి దృశ్యాలు సినిమాలో ఉండాలా ఉండకూడదా అని డిసైడ్ చేయాల్సింది సెన్సార్ బోర్డు మాత్రమే.  కాని సినిమా లో ఉన్న బూతు ద్రుశాలు అన్నీ వీధిలో పెడితే సగటు మనిషి స్పందించి కందించడంలో న్యాయముంది అని ప్రియమైన సినీ పెద్దలు గమనించాలి.  ప్రతివాడికి సినిమా వాళ్ళంటే అలుసైపాయింది అని తమ్మారెడ్డి భరద్వాజ గారు ఈ సందర్భంలో అనడం సిగ్గు చేటు.  ప్రతి సినిమా వాడికి ఇలా మాట్లాడడం ఫ్యాషన్ ఐపోయింది.  తప్పుడు పనులు చేయడం దొరికితే బుకాయించడం వితండ వాదం చేయడం సినిమా వాళ్లకు అలవాటైపోయింది.  మహానుభావులు ఏలిన తెలుగు సినిమా ఇప్పుడు బ్రస్టు పట్టి పోతోంధనడానికి ఇలాంటి వితండ వాదాలు చేసేవాళ్ళే కారణం.

ఈ సందర్భంలో తమ్మారెడ్డి భరద్వాజ గారిని ఒక ప్రశ్న అడగాలి, ఇదే హీరో సకుతుమ్భ సమేతంగా చూడదగ్గ సినిమా తీస్తే జనాలు చూడలేదా?  పెళ్లి చూపులు సినిమాకు డబ్బులు అవార్డులు రాలేదా? గుర్తింపు రాలేదా? డబ్బు కోసం పేరు కోసం ఇంతగా దిగజారాలా?  దిగాజారుతే దిగజారారు, మీ సినిమా మీ ఇష్టం మీ సినిమాలో ఏమైనా పెట్టుకోండి కాని అవన్నీ పోస్టర్ల పై అచ్చేసి చూపించే ముందు సమాజంలో అక్క, చెల్లి, కూతురు, కొడుకు అందరు తిరుగుతుంటారు అని గుర్తుంచుకోవాలి కదా..! కేవలం మీ సినిమా వ్యాపారం పెంచుకోవడం మాత్రమే మీ ద్యేయమా?

ఈరోజు ముద్దు ఫోటో.. రేపు హీరోయిన్ టాప్ లెస్ ఫోటో.. ఎల్లుండి డైరెక్ట్ గా హీరో హీరోయిన్ల కామ కేళి ఫోటో ఇంకేముంది.  పిల్లలతో సినిమాలే చూడలేని పరిస్తితి, పిల్లలతో కుటుంభ సభ్యులతో కలిసి టీవీషో లు చూడలేని పరిస్థితి, కనీసం పిల్లలు, కుటుంబ సభ్యులతో కలిసి బజార్ కు కూడా వెళ్ళలేని పరిస్థితికి దిగజారడం కరెక్టే అంటారా? సినిమాలో ఏమైనా పెట్టుకోవోచ్చు అది తప్పా ఒప్పా అని నిర్ణయించడానికి సెన్సార్ బోర్డు ఉంది. ఆ సినిమా చూడాలా వొద్దా అనేది సినిమాకు వెళ్ళేవాడు డిసైడ్ చేసుకుంటాడు కాని సినిమాలో ఉన్న ప్రతీది రోడ్ పై చూపించడం, కుటుంభంతో ప్రయాణించే బస్సుపై చూపించడం కరెక్ట్ కాదు.  ఇంతకుముందు ఇలాంటి పోస్టర్లు వేయలేదా?  ఇప్పుడెందుకు దీన్ని వివాదం చేస్తున్నారు అంటే ఇంతకుముందు ఇలాంటివి వేసారేమో కాని ఇంత దారుణంగా బస్సులపై, బస్సు స్టాప్ లలో విచ్చలవిడిగా మాత్రం వేయలేదు. ఏదైనా ఇష్యూ రైజ్ ఐనపుడే దాని పై చర్చ జరుగుతుంది అది కర్రెక్టా కాదా అనేది డిసైడ్ అవుతుంది.



Tags: Arjun Reddy, Vijay Devarakonda, V.H., V. Hanumanta Rao, controversy, Lip Lock Poster, controversy.

No comments