Header Ads

NTR's Latest: ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త..!!

Jr NTR latest

జూనియర్ ఎన్టీఆర్ కు ఇటీవలే కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో, హోమ్ ఇసోలాటిన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నట్టు ట్వీట్ చేశారు. ఆ వార్త విన్న జూనియర్ అభిమానులు, నందమూరి అభిమానులు ఎంతో మానసిక ఒత్తిడికి లోనయి, తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలని, దేవుళ్ళకు మొక్కుతూ, సోషల్ మీడియా వేదికగా వేలల్లో పోస్టులు పెడుతూ ఎన్టీఆర్ తాను కోలుకున్నాననే శుభవార్త ఎప్పుడెప్పుడు వింటామా? అంటూ ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ ఆరోగ్యం కుదుటపడాలని అభిమానులతోపాటు సినిమా ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు సైతం స్పందించి తమ సోషల్ మీడియా ఖాతాలలో విషెస్ పెట్టారు.

NTR latest tweet

అయితే రంజాన్ పండుగ రోజున ఎన్టీఆర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ పండుగ విషెస్ తెలుపుతూ, తన ఆరోగ్యం కుదుటపడిందని, త్వరలోనే నెగటివ్ రిపోర్ట్ తో మీ ముందుకు వస్తానని శుభవార్త తెలుపుతూ, అభిమానులు దిగులు చెందకూడదని ధైర్యం చెబుతూ, అందరూ క్షేమంగా ఇంటిపట్టున ఉంటూ కరోనా రక్కసిని తరిమేయాలని సూచించారు.

ఎన్టీఆర్ ప్రస్తుతం ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఆర్.ఆర్.ఆర్. చిత్రం దాదాపుగా పూర్తి చేసేశారు. కాగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ ప్రాజెక్ట్, కొరటాల శివతో ఓ ప్రాజెక్ట్ కమిట్ అయ్యారు, అలాగే కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో మరో ప్రాజెక్ట్ చర్చల్లో ఉంది. అభిమానులకు వరుస సెన్సషనల్ ట్రీట్ ఇవ్వడానికి ఎన్టీఆర్ రెడీగా ఉన్నారు. ఒక్కసారి కరోనా నుండి దేశం బయటపడితే, ఇక ఎన్టీఆర్ తో పాటు, ప్రముఖ నటులు నటించిన సెన్సషనల్ సినిమాలన్నీ థియేటర్లలో క్యూ కట్టి ప్రేక్షకులను వరుసగా అలరించడానికి రెడీగా ఉన్నాయి.



See also: NTR upcoming movies, NTR upcoming cinemas, NTR present health status, NTR corona negative, NTR latest movies, ntr new movie details, 

No comments