Header Ads

మీ స్మార్ట్ ఫోన్, లాప్టాప్, టాబ్లెట్ తదితర విలువైన గాడ్జేట్స్ కు భీమ చేయించారా? వీటికి భీమా అందించే కంపెనీలు మరియు పాలసీ రుసుముల వివలు తెలుసుకోండి.


gadget insurance
ఈ స్మార్ట్ యుగంలో తోటి మనిషి తప్పిపోయినా లేదా ఏమైనా ప్రమాదం జరిగినా కూడా అంతగా చింతించే మనుషులు కరువవుతున్నారు.  మనుషులను వాడుకుంటూ వస్తువులను ప్రేమించడం ఈ స్మార్ట్ యుగంలోని మనుషులకు పరిపాటి అయ్యింది.  అందుకు కారణం నిద్ర లేచింది మొదలు మల్లి నిద్రించేవరకూ కూడా స్మార్ట్ ఫోన్, లాప్టాప్, టాబ్లెట్ వంటి పరికరాలను అంటిపెట్టుకొని జీవించడమే.. మనిషి నిత్య జీవితంలో వాటి ప్రాముఖ్యత కూడా ఎక్కువే, అవి సహాయపడే, చేసే పనులు కూడా ఎంతో విలువైనవి మరియు ఖచ్చితమైన, త్వరితగతిన పొందే ఫలితాలు వీటి ప్రాముఖ్యతను పెంచుతున్నాయి అని మనమందరికీ తెలుసు.  అందుకే స్మార్ట్ ఫోన్, లాప్టాప్ తదితర పరికరాలు మన నిత్య జీవితంలో భాగమైపోయాయి.  ఒక్క సారి అవి కనిపించకుండా పోతే, దొంగిలించబడితే, పాడైపోతే వాటి పై ఆధారపడే వ్యక్తులు తీవ్రమైన మానసిక క్షోభకు లోనవడం చూస్తూనే ఉన్నాం.  ఇంట్లో ఎవరో చనిపోయినట్టు, కుటుంభ సభుడు ఎవరికో అస్వస్థతగా ఉన్నట్టు వారు పడే ఆవేదన అంతా ఇంతా కాదు.  ఫోన్ దొంగిలించబదితేనో లేదా పొరపాటున ఎక్కడో పోతేనో ఎంత మొత్తుకున్నా తిరిగి ఆ ఫోన్ ను మరలా పొందలేము, పోలీస్ స్టేషన్లో కంప్లెయింట్ ఇచ్చినా కూడా పోలీసులు ఈ కేసులను సీరియస్ గా తీసుకుని తిరిగి ఆ ఫోన్ ను యజమానికి అప్పజెప్పే దాకలాలు ఎంతమాత్రమూ లేవు.  సెక్యూరిటీ యాప్ ల ద్వారా పోయిన ఫోన్ దొరకడం అన్నది కూడా చాల అరుదైన విషయమే.  

మరి ఎంతో వ్యయం చేసి కొన్న ఫోన్, లాప్టాప్, టాబ్లెట్ వంటి విలువైన వస్తువులను పోగొట్టుకుంటే తిరిగి పొందే వెసులుబాటు లేనే లేదా? అంటే ఖచ్చితంగా ఉంది, అవి పోకముందే ముందు జాగ్రత్తగా తగు భీమా కంపెనీల నుండి భీమా (ఇన్సురన్సు) చేయించుకోవడమే.  అప్పుడు తగు ఆధారాలు కంపెనీ కి అందజీసినచో మన ఫోన్ స్థానంలో కంపెనీ వారు మల్లి కొత్త ఫోన్ అందించే వెసులుబాటు కల్పిస్తున్నాయి ప్రముఖ ఎలక్ట్రానిక్ గాడ్జెట్ భీమా కంపెనీలు.  అంతే కాదు ఫోన్ నీళ్ళల్లో పడి పాడిపాయినా, ప్రమాద వశాత్తు క్రిందపడి పాడైపోయినా కూడా మరమ్మత్తుల కోసం వెచ్చించిన కర్చులను యజమానికి అందిస్తున్నాయి ఈ సంస్థలు.  మరి అలాంటి సంస్థలు, అవి అందించే భీమా సౌకర్యాలు మరియు వాటి ప్రీమియం రేట్లను తెలుసుకుందామా..

సిస్కా గాడ్జెట్ సెక్యూర్:
smartphone insurance company syska gadget security
సిస్కా సంస్థ మనందరికీ తెలిసి LED బల్బుల తయారీలో పేరు గాంచినది.  ఈ సంస్థ వారు స్మార్ట్ ఫోన్లకు భీమా అందించే సర్వీస్ ను కూడా ప్రారంభించినారు.
భీమా ప్రీమియం వివరాలు:
సిస్కా సంస్థ వారు స్మార్ట్ ఫోన్లకు అందించే భీమా సర్వీసుల, ఫోన్ యొక్క మోడల్ మరియు ధరలపై ఆధారపడి అత్యధిక ప్రీమియంలు రూ. 2,999 వరకూ పాలసీలు లభిస్తున్నాయి.
సిస్కా మొబైల్ భీమా సౌకర్యాలు:
సిస్కా వారు అందించే భీమ సౌకర్యాలు – ఫోన్ పోయినా, దొంగిలించబడ్డా, ప్రమాదవశాత్తు పాడైపోయినా, నీళ్ళలో పడి పాడైపోయినా, అగ్ని ప్రమాదానికి లోనయి పాడైపోయిన సందర్భాలలో ఈ సంస్థ వారు తమ భీమా పాలసీల ద్వారా కొత్త ఫోన్లను మరియు పాడైపోతే మరమ్మత్తు నిమిత్తం అయ్యే ఖర్చును భరించడం లాంటి సౌకర్యాలను అందిస్తున్నారు.

క్విక్ హీల్ గాడ్జెట్ ఇన్సురన్సు:
smartphone insurance company quich heal
క్విక్ హీల్ అనేది ఒక యాంటీ వైరస్ సంస్థ అని మనందరికీ తెలుసు, ఈ సంస్థ కంప్యూటర్, లాప్టాప్, టాబ్లెట్ మరియు స్మార్ట్ ఫోన్లకు తమ సాఫ్ట్వేర్ ల ద్వారా వైరస్ల నుండి రక్షణను కల్పిస్తూ వస్తూంది.  ఈ సంస్థ వారు కూడా ఇటివలే గాడ్జెట్ భీమా రంగం లోనికి అడుగిడినారు.  ఈ సంస్థ స్మార్ట్ ఫోన్లకు, ఇతర డిజిటల్ గాడ్జెట్లకు భీమా సౌకర్యాలను అందిస్తున్నారు.
భీమా ప్రీమియం వివరాలు:
క్విక్ హీల్ గాడ్జెట్ ఇన్సురన్సు వారు అందించే గాడ్జెట్ భీమా పాలసీల ప్రీమియంలు ఫోన్ యొక్క మోడల్ మరియు ధరపై ఆధారపడి రూ. 599 నుండి మొదలుకుని రూ.2,499 వరకు లభిస్తున్నాయి.
క్విక్ హీల్ గాడ్జెట్ భీమా సౌకర్యాలు:
క్విక్ హీల్ గాడ్జెట్ ఇన్సురన్సు వారు అందించే భీమ సౌకర్యాలు – ఫోన్ పోయినా, దొంగిలించబడ్డా, ప్రమాదవశాత్తు పాడైపోయినా సందర్భాలలో ఈ సంస్థ వారు తమ భీమా పాలసీల ద్వారా కొత్త ఫోన్ కొనుగోలుకు అయ్యే కర్చును మరియు పాడైపోతే మరమ్మత్తు నిమిత్తం అయ్యే ఖర్చును భరించడం లాంటి సౌకర్యాలను అందిస్తున్నారు.

ఆన్ సైట్ సెక్యూర్:
smartphone insurance company onsite
ఆన్ సైట్ సెక్యూర్ సంస్థ ఎలక్ట్రానిక్ మరియు ఇతర డిజిటల్ గాడ్జెట్లకు భీమా అందించే సంస్థ.  ఈ సంస్థ స్మార్ట్ ఫోన్లకు, టాబ్లెట్లకు, లాప్టాప్ లకు, డిజిటల్ కెమెరా తదితర డిజిటల్ గాడ్జెట్లకు భీమా సౌకర్యాలను అందిస్తోంది.
భీమా ప్రీమియం వివరాలు:
ఆన్ సైట్ సెక్యూర్ వారు అందించే గాడ్జెట్ భీమా పాలసీల ప్రీమియంలు వస్తువు ధరపై ఆధారపడి ఉంటాయి.  రూ. 5,000 లోపు విలువైన వస్తువులకు భీమ ప్రీమియం రూ. 600లు గా మరియు రూ. 80,000 లోపు విలువైన వస్తువులకు భీమ ప్రీమియం రూ. 10,000లు గా నిర్ణయించారు.
ఆన్ సైట్ సెక్యూర్ భీమా సౌకర్యాలు:
ఆన్ సైట్ సెక్యూర్ వారు అందించే భీమ సౌకర్యాలు – ఫోన్ పోయినా, దొంగిలించబడ్డా, ప్రమాదవశాత్తు పాడైపోయినా, నీళ్ళలో పడి పాడైపోయినా, తాకే తెర పగిలిపోయినా, హార్డువేర్ సమస్యలు వొచ్చినా కూడా ఈ సంస్థ వారు తమ భీమా పాలసీల ద్వారా కొత్త ఫోన్ల కొనుగోలుకు అయ్యే ఖర్చును లేదా పాడైపోతే మరమ్మత్తు నిమిత్తం అయ్యే ఖర్చును భరించడం లాంటి సౌకర్యాలను అందిస్తున్నారు.

యాప్స్ డైలీ:
smartphone insurance company apps daily
మరొక గాడ్జెట్ భీమా సంస్థ యాప్స్ డైలీ ఇది స్మార్ట్ ఫోన్లకు మరియు ఇతర ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ గాడ్జెట్లకు భీమా అందిస్తున్నది.
భీమా ప్రీమియం వివరాలు:
యాప్స్ డైలీ వారు అందించే గాడ్జెట్ భీమా పాలసీల ప్రీమియంలు ఫోన్ యొక్క మోడల్ మరియు ధరపై ఆధారపడి రూ. 599 నుండి మొదలుకుని రూ.2,499 వరకు లభిస్తున్నాయి.
యాప్స్ డైలీ భీమా సౌకర్యాలు:
ఆన్ సైట్ సెక్యూర్ వారు అందించే భీమ సౌకర్యాలు – ఫోన్ పోయినా, దొంగిలించబడ్డా, ప్రమాదవశాత్తు పాడైపోయిన సందర్భాలలో ఈ సంస్థ వారు తమ ఇన్సురన్సు పాలసీల ద్వారా కొత్త ఫోన్ల ధరను భరించడం మరియు పాడైపోతే మరమ్మత్తు నిమిత్తం అయ్యే ఖర్చును భరించడం లాంటి సౌకర్యాలను అందిస్తున్నారు.


మీ స్మార్ట్ ఫోన్లకు, లాప్టాప్ లకు, టాబ్లెట్ కంప్యూటర్ల కు లభించే భీమ పాలసీల గురించి వాటిని అందించే సంస్థల గురించి తెలుసుకున్నారుగా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ఎంతో అల్లారుముద్దుగా చూసుకునే మీ విలువైన వస్తువు మిస్ అయినా కూడా తిరిగి పొందాలంటే వెంటనే భీమా పాలసీ చేయించుకోండి మరి.

No comments